ఒకప్పుడు హిట్ సినిమాల రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్పందన రీరిలీజ్ లకు రావడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఒక సాధారణ విషయంగా మారింది. చిరంజీవి నటించిన స్టాలిన్ 4K భారీ పరాజయం పాలైంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు స్టాలిన్‌ను రీ-రిలీజ్ చేశారు, కానీ స్పందన దారుణంగా ఉంది.
ప్రేక్షకులు సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని షోలకు మాత్రమే మంచి ఆక్యుపెన్సీ ఉంది. అదనపు షోలకు డిమాండ్ లేదు. ప్రేక్షకుల కొరత కారణంగా చాలా షోలు ప్రారంభం కాకముందే రద్దు చేశారు. ఈ సినిమా మరీ అంత పాతది కాకపోవడం, సరిగ్గా రీరిలీజ్ ను ప్లాన్ చేయకపోవడంతో రిజల్ట్ ఇలా అయిందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.