శ్రీ రెడ్డి.. సమంత వేసుకునే బట్టలపై కామెంట్స్
Srireddy Comments On Samantha. శ్రీ రెడ్డి.. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసింది. సంచలన వ్యాఖ్యలతో
By Medi Samrat Published on 28 Dec 2020 4:28 PM ISTశ్రీ రెడ్డి.. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసింది. సంచలన వ్యాఖ్యలతో కామెంట్లతో పలువురి మీద విరుచుకుపడిన శ్రీ రెడ్డి ముఖ్యంగా నాని, దగ్గుబాటి కుటుంబం మీద, మెగా హీరోల మీద కామెంట్ల మీద కామెంట్లు చేస్తూ ఉండేది. ఒకప్పుడు మీడియాలో ఎంతో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి తమిళంలో ప్రాజెక్టులు చేయడంలో బిజీగా అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు. తాజాగా అక్కినేని వారి కోడలు, నటి సమంత అక్కినేనిపై శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించింది.
తన హాట్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను ఇటీవల సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. సమంత డీసెంట్ గా కనిపించాలని శ్రీ రెడ్డి చెబుతోంది. అక్కినేని కుటుంబంలో అమల గారి వస్త్రధారణ ఎంతో హుందాతనంతో కూడి ఉంటుందని అన్నారు. సమంత డ్రెస్సింగ్ మాత్రం తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెప్పారు. మహేశ్ బాబు భార్య నమ్రతను చూసి సమంత నేర్చుకోవాలని.. హీరోగా మహేశ్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారని చెప్పారు. నీ భర్త నాగచైతన్య హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడని ఆయన కెరీర్ ని నీవు చూసుకోవచ్చు కదా? అని అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సరైన డ్రస్సులు వేసుకోవడం లేదని చెబుతోంది శ్రీ రెడ్డి. అక్కినేని అభిమానులకు అది నచ్చడం లేదని అన్నారు.