అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటకు.. దేనికోసమో..?

Srinivas Avasarala Shocking Look. అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ ఓ కో-డైరెక్టర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో

By Medi Samrat
Published on : 24 March 2021 6:28 PM IST

అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటకు.. దేనికోసమో..?

అవసరాల శ్రీనివాస్.. టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్..! ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు దర్శకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఓ వీడియో బయటకు వచ్చింది. అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ ఓ కో-డైరెక్టర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. అవసరాల శ్రీనివాస్‌ దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్నానని కోడైరెక్టర్‌ మహేశ్‌ చెప్పుకొచ్చాడు. మహేశ్‌కి శ్రీనివాస్‌కి మధ్య గొడవలు వచ్చాయని.. అతన్ని తిట్టి ఆఫీస్‌ నుంచి గెంటేశాడట..! దీంతో మహేశ్‌.. శ్రీనివాస్‌ ఆఫీస్‌కి వెళ్లి రచ్చ గొడవపెట్టుకున్నాడు. తాను అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెట్టబోతున్నానని చెప్పుకొచ్చాడు. అవసరాల శ్రీనివాస్‌ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్‌‌ ఫేస్‌ చూపించి షాకిచ్చాడు.

నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి అంటూ ఫోటో షూట్‌లో ఉన్న శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేశాడు. అలా చేయడంతో.. శ్రీనివాస్‌ బట్టతల బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్‌.. మహేశ్‌ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. ఇలా బట్టతలతో అవసరాల శ్రీనివాస్ ఉంటాడని ఎవరూ అనుకోలేదు. అయితే ఇది ఖచ్చితంగా సినిమా ప్రమోషన్ కోసమేనని అంటూ ఉన్నారు. ఏ సినిమా అప్డేట్ అయ్యింటుందో.. వీలైనంత తొందరగా తెలిసిపోద్దిలెండి..!



Next Story