శేఖర్ మాస్టర్ కు క్షమాపణలు చెప్పిన శ్రీలీల

శ్రీలీల అంటే డ్యాన్స్.. ఇప్పుడు ఉన్న హీరోయిన్ లలో అద్భుతమైన డ్యాన్స్ చేసే హీరోయిన్లలో

By Medi Samrat  Published on  28 Aug 2023 9:04 PM IST
శేఖర్ మాస్టర్ కు క్షమాపణలు చెప్పిన శ్రీలీల

శ్రీలీల అంటే డ్యాన్స్.. ఇప్పుడు ఉన్న హీరోయిన్ లలో అద్భుతమైన డ్యాన్స్ చేసే హీరోయిన్లలో శ్రీలీల ఒక‌రంటూ ఇప్పటికే ఫ్యాన్స్ చెప్పేశారు. అయితే ఓ సినిమాకు సంబంధించి సాంగ్ షూటింగ్ లో చాలా టేక్స్ తీసుకోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డానని శ్రీలీల చెప్పింది. ఒక సినిమా షూటింగ్‌ సమయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల చాలా బాధపడినట్లు శ్రీలీల తెలిపింది. షూటింగ్‌లో ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే సమయంతో పాటు నిర్మాతకు కూడా ఖర్చు పెరుగుతుందని తెలిపింది.

ఓ సారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ చేస్తూ ఉండగా ముప్పై టేకులు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్‌ చేసినా కూడా ఓకే కాలేదని.. అలా ముప్పై సార్లు రీటేక్స్‌ తీసుకోవడం చాలా బాధ అనిపించిందని చెప్పింది. షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ మూడు పేజీల లేఖను శేఖర్ మాస్టర్‌కు రాశానని తెలిపింది. అందుకు ఆయన కూడా తనకు ఫోన్‌ చేసి ఇందులో నీ తప్పేంలేదు.. ఈ పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్స్‌ ఉన్నారు. వారు బ్యాక్ గ్రౌండ్‌లో కరెక్ట్‌ స్టెప్‌లు వేయడం లేదని.. అందుకే ఇన్ని రీటేక్స్‌ తీసుకోవాల్సి వచ్చిందని శేఖర్ మాస్టర్‌ చెప్పడంతో తాను కుదుట పడ్డానని తెలిపింది. శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. రామ్ తో చేసిన స్కంద సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

Next Story