టామ్ హాలండ్ నటించిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' విడుదలైన మూడు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 79.14 కోట్లు వసూలు చేసి రికార్డులను బద్దలు కొట్టింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ "'#SpiderMan' is UNSHAKABLE and UNBEATABLE on Day 3… Fetches Rs 26 cr+ on non-festival Saturday in pandemic era is … Expect another big day today [Sun]… Thu 32.67 cr, Fri 20.37 cr, Sat 26.10 cr. Total: Rs 79.14 cr Nett BOC… Gross BOC: Rs 100.84 cr. #India biz." ఇలా ట్వీట్ చేశారు.
జోన్ వాట్స్ దర్శకత్వం వహించిన 'నో వే హోమ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. పీటర్ పార్కర్ గుర్తింపును ప్రపంచానికి వెల్లడించిన తర్వాత చోటు చేసుకునే అంశాలను ఈ సినిమాలో ఉంచారు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటిది ఈ సినిమా కావడంతో అందరూ ఈ సినిమాను చూడడానికి ఎగబడుతూ ఉన్నారు. ఎంతో ఎమోషనల్ టచ్ కూడా ఈ సినిమాలో ఉంది. ఎంజే గా జెండయా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ స్ట్రేంజ్‌గా బెనెడిక్ట్ కంబర్‌బాచ్, నెడ్ లీడ్స్‌గా జాకబ్ బటాలోన్, పీటర్ అత్త మే పాత్రలో మారిసా టోమీ కనిపించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'ని ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల చేసింది.