బాలీవుడ్ నటుడు సోనూసూద్ కుటుంబానికి సంబంధించిన ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. సోనూసూద్ భార్య, మరికొందరు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి జరిగినట్లు సమాచారం. సోనూసూద్ కుటుంబ సన్నిహితుడి నుండి అందిన సమాచారం ప్రకారం.. ముంబై నాగ్‌పూర్ హైవే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సోనూసూద్ నాగ్‌పూర్‌కు బయలుదేరారు. కారులో సోనూసూద్ భార్య సోనాలి, ఆమె సోదరి కుమారుడు, ఆమె సోదరుడు ఉన్నట్లు తెలుస్తుంది. కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
నటుడి భార్య కారు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కారు ఫోటోను చూస్తుంటే అతి వేగంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న సోనూసూద్ భార్య, మేనల్లుడు కూడా గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం అతని భార్య సోనాలి, మేనల్లుడు అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.