ఓటీటీలోకి వచ్చేస్తున్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' మూవీ

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్, ప్రణవి మానుకొండ

By Medi Samrat  Published on  23 Aug 2023 4:45 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్, ప్రణవి మానుకొండ హీరోహీరోయిన్లుగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏఆర్ శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను.. మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఇక బుల్లితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో జులై 29న రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించారు.

గురువారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ప్రజల నమ్మకాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేసే హడావుడు వంటి వాటిని ఈ సినిమాలో చూపించారు. కుక్కని పెళ్లి చేసుకోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, జీవితం ఎంత గందరగోళంగా మారిపోయిందనే కాన్సెప్ట్ బుల్లితెర మీద ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

Next Story