సీతారామం రీమేక్ పై దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు

Sita Ramam to have remake or sequel. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ లు హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతా రామం' సినిమా

By Medi Samrat  Published on  16 Sept 2022 7:30 PM IST
సీతారామం రీమేక్ పై దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ లు హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతా రామం' సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం ఉత్తరాదిలోనూ భారీ విజయాన్ని సాధించింది. ముంబైలో జరిగిన సీతా రామం సక్సెస్ మీట్‌లో దుల్కర్ సల్మాన్ ముచ్చటించారు. ఈ చిత్రం రీమేక్ లేదా సీక్వెల్ చూడగలరా అని ప్రశ్నించారు. సీతారామం రీమేక్‌లో ఎవరిని చూడాలనుకుంటున్నారు, దాని సీక్వెల్ గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడాడు. సీతా రామం ఒక ఇతిహాసం, క్లాసిక్ చిత్రం అవుతుందని మేము అందరం నిజంగా భావించాం. దీన్ని రీమేక్ చేయడం మంచిది కాదని చెప్పుకొచ్చాడు దుల్కర్.

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'సీతా రామం'. ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వసూళ్లును రాబడుతూ ముందుకు సాగుతోంది.


Next Story