ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(96) న్యూమోనియా వ్యాధితో బాధపడుతు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు కన్నుమూశారు. రచయిత సిరివెన్నెల భౌతిక కాయానికి పలువురు సీని ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతికకాయాన్ని ఉంచారు. హీరో వెంకటేశ్, దర్శకులు రాజమౌళి, గుణశేఖర్, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, మణిశర్మ, గాయని సునీతతో పాటు రావు రమేష్, ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు.
సిరివెన్నెలకు నివాళులు అర్పించే సమయంలో తనికెళ్ల భరణి ఒకింత భావోద్వేగానికి లోనై కన్నీంటి పర్యంతమయ్యారు. తనికెళ్ల భరణిని దర్శకుడు త్రివిక్రమ్ ఓదార్చారు. అలాగే సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాహిత్య రంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయామని హీరో వెంకటేశ్ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దాదాపు 800పైగా సినిమాల్లో 3 వేలకుపైగా పాటలు రాశారు. చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.