వేడుకగా టాలీవుడ్‌ సింగర్‌ రేవంత్‌ వివాహం.!

Singer Revanth wedding celebrations. టాలీవుడ్ సింగర్, ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ వివాహ వేడుక ఫిబ్రవరి 6వ తేదీన ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన

By అంజి  Published on  7 Feb 2022 12:16 PM IST
వేడుకగా టాలీవుడ్‌ సింగర్‌ రేవంత్‌ వివాహం.!

టాలీవుడ్ సింగర్, ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ వివాహ వేడుక ఫిబ్రవరి 6వ తేదీన ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన అన్వితతో పెళ్లి జరిగింది. దీంతో రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరిగింది. గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సింగర్స్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సింగర్‌ రేవంత్‌ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే గాయకుడు రేవంత్‌కి అన్వితతో నిశ్చితార్థం జరగ్గా, ఈరోజు కుటుంబ సభ్యులు హల్దీ, పెళ్లికొడుకు వేడుకలు జరుపుకున్నారు.

రేవంత్ పెళ్లికి ముందు జరిగిన ముహూర్తపు ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. అతను తన సోషల్ మీడియా ద్వారా నిశ్చితార్థ వేడుక క్షణాలను పంచుకున్నాడు. అతని పోస్ట్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేవంత్ తన అద్భుతమైన గాన ప్రతిభతో తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టాడు. అతను ఇండియన్ ఐడల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తెలుగులో పలు రియాల్టీ షోల్లో పాల్గొన్నాడు. ఇక తెలుగు సినిమాల్లో ఆయన పాడిన పాటలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇటీవల చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో సానం కష్టం వచ్చిందే సాంగ్‌ను రేవంతే పాడాడు.

Next Story