ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కథనాలు వెలువడుతున్నాయి. తాను ఉంటున్న ఇంట్లోనే ఆమె ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేట్‌లో ఉంటుంది. కల్పన రెండు రోజులుగా ఇంటి డోర్ తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి కల్పన అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కల్పనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి.. అసలు ఏం జరిగిందనే విషయమై పూర్తి వివరాలు తెలియాల్సివుంది