భారీగా పలికిన శ్యామ్ సింగరాయ్ శాటిలైట్ రైట్స్
Shyam Singha Roy Satellite Rights. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' తెలుగు శాటిలైట్ హక్కులు 10 కోట్ల రూపాయలకు
By Medi Samrat Published on 11 Dec 2021 4:06 PM ISTనాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' తెలుగు శాటిలైట్ హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సినిమా హక్కులను జెమినీ టీవీ కొనుగోలు చేసింది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. 'శ్యామ్ సింగ రాయ్'లో నాని ద్విపాత్రాభినయం చేస్తుండడంతో హైప్ భారీగా ఉంది. త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను బి4యు 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా భారీ డీల్ తో 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతుందని సమాచారం. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. నాని రెండు పాత్రల్లో కనిపించనుండగా.. ఒక పాత్రలో విప్లవ రచయితగా, సంఘ సంస్కర్తగా కనిపిస్తారు. సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించనుండగా, కృతి శెట్టి యూత్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సత్యదేవ్ జంగా రాసిన కథ 'శ్యామ్ సింఘరాయ్'. నవీన్ నూలి ఎడిటర్‌గా, జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, యష్ మాస్టర్ ఈ సినిమా పాటలకు కొరియోగ్రఫీ అందించారు. డిసెంబర్ 24న 'శ్యామ్ సింగరాయ్' థియేటర్లలోకి రానుంది.