నారా రోహిత్ సంచలన చిత్రం షూటింగ్ ప్రారంభం

ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ప్రతినిధి 2తో హీరో నారా రోహిత్ తిరిగి

By Medi Samrat  Published on  28 Aug 2023 7:45 PM IST
నారా రోహిత్ సంచలన చిత్రం షూటింగ్ ప్రారంభం

ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ప్రతినిధి 2తో హీరో నారా రోహిత్ తిరిగి వెండి తెరపై సత్తా చాటనున్నారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ సినిమా అయిన ప్రతినిధి 2, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నారా రోహిత్‌తో పాటు సినిమాలోని ఇతర ముఖ్య నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి.

ఐదేళ్ల తర్వాత నారా రోహిత్ కెమెరా ముందుకు వస్తున్నారు. అటు టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయం కాబోతుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. ఎలాంటి అంశాలను సినిమాలో చూపిస్తారనేది తెలియాల్సి ఉంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 25, 2024న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story