పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ..!

గత రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  2 July 2024 8:10 PM IST
పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ..!

గత రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు చూసిన నందమూరి మోక్షజ్ఞ.. ఇలా సూపర్ గా మారిపోయాడు అంటూ నందమూరి అభిమానులు కూడా తెగ ఖుషీ అవుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇక లాంఛనమే అని స్పష్టంగా తెలుస్తోంది.

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తన కుమారుడి ప్రవేశంపై పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. వివిధ టాలీవుడ్ దర్శకులతో తన లాంచ్ గురించి అనేక పుకార్లు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. మోక్షజ్ఞ తాజా లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ తొలి చిత్రం గురించిన అప్‌డేట్ అతని పుట్టినరోజున రానుంది. నందమూరి వారసుడు అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో తొలి చిత్రం లాక్ చేశారు. ఇది పాన్-ఇండియన్ చిత్రం అవుతుందని తెలుస్తోంది.

Next Story