ఆ హీరో చెల్లెలు పెళ్లి అంగరంగ వైభవంగా..

Shahid Kapoor shares adorable pic with newlywed sister Sanah Kapur. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోదరి పెళ్లి ఘనంగా జరిగింది. సుప్రియా పాఠక్, పంకజ్ కపూర్ ల కుమార్

By Medi Samrat  Published on  3 March 2022 11:36 AM IST
ఆ హీరో చెల్లెలు పెళ్లి అంగరంగ వైభవంగా..

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోదరి పెళ్లి ఘనంగా జరిగింది. సుప్రియా పాఠక్, పంకజ్ కపూర్ ల కుమార్తె సనా కపూర్, మనోజ్ పహ్వా, సీమా పహ్వా కుమారుడు మయాంక్‌ ను పెళ్లి చేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. సనా వివాహ వేడుక నుండి కొన్ని చిత్రాలను పోస్టు చేశారు. పలువురు వారికి అభినందనలు తెలిపారు. సనా కపూర్ ఎరుపు రంగు బ్లౌజ్‌తో పాటు అందమైన ఎంబ్రాయిడరీని కలిగి ఉన్న తన పాస్టెల్ బ్లూ లెహంగాలో కనిపించింది. మయాంక్ పహ్వా బ్రౌన్ ఫార్మల్ దుస్తులలో కనిపించాడు. వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్ మనసుకు హత్తుకునేలా ఉంది. అంతటా పూలతో అలంకరించారు. సనా కపూర్, మార్చి 2న మహాబలేశ్వరం లో వివాహం చేసుకుంది.

షాందార్ చిత్రంలో సనా కనిపించింది. సనా షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్ కుమార్తె. సనా మయాంక్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. కొంతకాలం క్రితం నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. సనా 2015లో వికాస్ బహ్ల్ యొక్క షాందార్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మయాంక్ పహ్వా పలు నాటకాల్లో నటించాడు. వాటికి దర్శకత్వం కూడా వహించాడు. భీష్మోత్సవ్, ఇంపేషియంట్ సీకర్, శరద్ జోషి ఎక్స్‌ప్రెస్, హ్యాపీ బర్త్‌డే మొదలైన నాటకాల ద్వారా తన ట్యాలెంట్ ను చూపించాడు. అతను కోశా, క్రికెట్: మై రిలిజియన్, వన్ నైట్ స్టాండ్ అప్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.

"How time flies and little bitto is now a bride. All grown up all too soon my baby sister an emotional beginning to a wonderful new chapter. Dearest @sanahkapur15 wishing you and Mayank sunshine and good vibes always (sic)" అంటూ షాహిద్ కపూర్ తన సోదరిపై ప్రేమను కురిపిస్తూ పోస్టు పెట్టాడు.


Next Story