షారుఖ్ ఖాన్ పక్కనే ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

Shah Rukh Khan poses with his Brahmastra stunt double Hasit Savani. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర' లో కీలక పాత్రలో

By Medi Samrat  Published on  18 Sept 2022 5:30 PM IST
షారుఖ్ ఖాన్ పక్కనే ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర' లో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే..! సినిమా స్టార్టింగ్ లోనే షారుఖ్ ఖాన్ కనిపించి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్య పరిచాడు. తెరపై ఉన్నంత సేపు అలరించాడు. షారుఖ్ ఖాన్ బ్రహ్మాస్త్రలో మోహన్ భార్గవ గా కనిపించాడు. అతడి దగ్గర వానర్ అస్త్ర ఉంటుంది. పాత్ర నిడివి తక్కువే అయినా బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్‌కు స్టంట్ డబుల్ అయిన హసిత్ సవానీ.. సినిమా సెట్స్ నుండి ఓ చిత్రాన్ని పంచుకున్నారు.

బ్రహ్మాస్త్రలో షారుఖ్‌కి ​​హసిత్ సవానీ స్టంట్ డబుల్. సెట్స్ నుండి బాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. SRK హసిత్‌తో పోజులిచ్చేటప్పుడు ఆనందంగా నవ్వుతూ కనిపించాడు. "బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర లో తన అతిధి పాత్ర కోసం లెజెండ్, షారుఖ్ ఖాన్ కోసం స్టంట్ డబుల్ కావడం చాలా ఆనందంగా ఉంది," అని హసిత్ అప్లోడ్ చేసిన చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

షారుక్‌ ఖాన్ 2023 లో భారీ సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నాడు. జనవరి 25, 2023న పఠాన్‌తో అభిమానులను పలకరించనున్నాడు. దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో కలిసి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత, అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్‌'లో నయనతారతో SRK స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. 2023 చివరి నాటికి, తాప్సీ పన్నుతో కలిసి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డుంకీ'లో కనిపించనున్నాడు.


Next Story