మన్నత్ వద్ద రెపరెపలాడిన త్రివర్ణ ప‌తాకం

Shah Rukh Khan Hoisted The Flag At Mannat With Gauri. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా 'హర్ ఘర్ తిరంగ' లో భాగమయ్యారు.

By Medi Samrat
Published on : 15 Aug 2022 5:00 PM IST

మన్నత్ వద్ద రెపరెపలాడిన త్రివర్ణ ప‌తాకం

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా 'హర్ ఘర్ తిరంగ' లో భాగమయ్యారు. ముంబైలోని తన బంగ్లా మన్నత్‌లో ఆదివారం త్రివర్ణాన్ని ఎగురవేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని షారుఖ్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకల్లో భాగమయ్యాడు. భార్య గౌరీ ఖాన్ కుమారులు ఆర్యన్, అబ్రామ్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో తమ పాత్రను పోషించారు.

షారుఖ్ తన కుటుంబంతో కలిసి జెండాను ఎగురవేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు "Teaching the young ones at home the essence and sacrifice of our Freedom Fighters for our country India, will still take a few more sittings. But getting the flag hoisted by the little one made us all FEEL the pride, love and happiness instantly." అంటూ పోస్టు పెట్టారు. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ జెండా ముందు నిలబడి ఉన్న మొత్తం కుటుంబానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. అయితే ఈ ఫొటోలో కుమార్తె సుహానా ఖాన్ కనిపించలేదు. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్‌లతో సహా చాలా మంది ప్రముఖులు 'హర్ ఘర్ తిరంగ' లో భాగమయ్యారు.


Next Story