ముగిసిన న‌టి జమున‌ దహన సంస్కారాలు

Senior Actress Jamuna Last Rites Completed. సీని నటి జమున అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.

By M.S.R  Published on  27 Jan 2023 6:25 PM IST
ముగిసిన న‌టి జమున‌ దహన సంస్కారాలు

సీని నటి జమున అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు. జమునకు కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో రావాడానికి ఆలస్యం అవుతుందని తెలియడంతో కుమార్తె స్రవంతి దహన సంస్కారాలు నిర్వహించారు.

నటి జమున ఇవాళ హైదరాబాద్ లో మృతి చెందారు. ఆమె మృతదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ ఛాంబర్ లొనే సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Next Story