'సర్కారు వారి పాట' మొద‌లైంది.. 20రోజుల పాటు అక్క‌డే షూటింగ్‌..!

Sarkari Vari Pata Shooting Started. సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు 'సర్కారు వారి పాట' సినిమా రెగ్యులర్‌ షూటింగ్ దుబాయ్‌లో మొదలైందంటూ ప్రకటించింది.

By -  Medi Samrat
Published on : 25 Jan 2021 2:14 PM IST

Sarkari Vari Pata Shooting Started.
సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు అభిమానులకు 'సర్కారు వారి పాట' నిర్మాణ సంస్థ‌ 14 రీల్స్ ప్లస్‌ సర్‌ప్రైజ్ న్యూస్ చెప్పింది. నేటి నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ దుబాయ్‌లో మొదలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా‌ ప్రకటించింది. 'ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్' అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది.


గీత‌గోవిందం ఫేమ్‌ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీస్‌, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఎస్.ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ''సర్కారు వారి పాట' మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబును డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామన్నారు. ఇక ఈ సినిమాలో మ‌హేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Next Story