కారు ప్రమాదంలో నటి వైభవి కన్నుమూత

Sarabhai vs Sarabhai actress Vaibhavi Upadhyaya aka Jasmine dies in a car accident. సారాభాయ్ Vs సారాభాయ్ నటి వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 24 May 2023 8:14 AM IST

కారు ప్రమాదంలో నటి వైభవి కన్నుమూత

సారాభాయ్ Vs సారాభాయ్ నటి వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారు. కారు ప్రమాదంలో నటి ప్రాణాలు కోల్పోయింది. దురదృష్టకర వార్తను నిర్మాత జెడి మజేథియా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌లో ఈ దుర్ఘటన గురించి వెల్లడించాడు. చాలా మంచి నటిని కోల్పోయామని తెలిపారు. సారాభాయ్ vs సారాభాయ్‌లో 'జాస్మిన్'గా ప్రసిద్ధి చెందిన వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారని తెలిపారు.

ఆమె వయసు 32. అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు ముంబైలో జరగనున్నాయి. వైభవి తన కాబోయే భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె చాలా సంవత్సరాలుగా C.I.D, అదాలత్ వంటి అనేక షోలలో కనిపించారు. కానీ సారాభాయ్ Vs సారాభాయ్‌లో ఆమె పాత్రకు మంచి పాపులారిటీ వచ్చింది. నటుడు దేవెన్ భోజానీ కూడా వైభవి ఉపాధ్యాయ మరణం తీరని లోటు అంటూ చెప్పుకొచ్చారు. వైభవి 2020లో 'ఛపాక్' సినిమాలో దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22న ముంబైలోని అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన కొద్ది రోజులకే వైభవి మరణ వార్త వచ్చింది.


Next Story