అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ మూవీని జీ5, జీ తెలుగు రెండింట్లోనూ మార్చి 1మా ఏకకాలంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ZEE తెలుగు, ZEE5 యాప్ లో మార్చి 1 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ అవుతుంది.
థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా ZEE5 ఓటీటీలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సత్తాచాటింది. టాలీవుడ్‍లో రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ అంచనాలను మించి కలెక్షన్లు దక్కించుకుంది.