గోవాలో జరిగే 53వ ఇఫీ– 2022 లో 'శంకరాభరణం' చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. Restored Indian Classics విభాగంలో ఈ సినిమా చేరింది. National Film Archives of India మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి , భద్ర పరిచే కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణంకు గుర్తింపు దక్కింది. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరావు నిర్మించిన శంకరాభరణం అప్పట్లోనే ఎంతో పేరును సంపాదించుకోగా.. తెలుగు సినిమాల్లోనే ఒక క్లాసిక్ గా నిలిచింది.
శంకరాభరణం సంగీత ప్రాధాన్యత గల సినిమా. ఈ మూవీని పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. జె.వి సోమయాజులు.. మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించగా.. కె.వి మహదేవన్ సంగీతం అందించారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక్లలో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. ఈ సినిమాను పనాజీలో ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. గొప్ప సినిమాను ఎన్నేళ్లకైనా గుర్తుంచుకుంటారనడానికి శంకరాభరణం సినిమా ఓ గొప్ప ఉదాహరణ.