సంజయ్ దత్ 'అధీర' పాత్ర చేయడానికి ఆమెనే కారణమట
Sanjay Dutt reveals who encouraged him to do Yash starrer film. కేజీఎఫ్ సినిమా రెండో భాగం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 9 April 2022 9:15 PM IST
కేజీఎఫ్ సినిమా రెండో భాగం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా హీరోను ఢీకొట్టేది సంజయ్ దత్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. KGF చాప్టర్-2 లో సంజయ్ దత్ పోషించిన 'అధీర' పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. KGF 2 చేయడానికి తనను ప్రోత్సహించినందుకు అతని భార్య మాన్యతా దత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
"KGF చాప్టర్ 2 కి సంబంధించి చేసిన ఈ ప్రయాణం 45 సంవత్సరాల తర్వాత నాకు ఒక పాఠం లాంటిది. ఈ సినిమా స్పాట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్ట్ మేమంతా కుటుంబమే. ఒక అద్భుతమైన సహచరుడిగా ఉన్నందుకు యష్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత నిరాడంబరమైన వ్యక్తితో నటించాను. నా తమ్ముడితో సమానం." అని చెప్పుకొచ్చారు సంజయ్ దత్. ప్రశాంత్ నీల్ తనను అధీర గా చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. బెంగుళూరులో జరిగిన ప్రీ రిలీజ్ సందర్భంగా, ఈ ఫ్రాంచైజీలోకి సంజయ్ చేరిక అద్భుతమని యష్ అన్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కూడా సంజయ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో యష్ గుర్తు చేసుకున్నారు. యష్ , "సంజు సార్.. మీరు నిజమైన ఫైటర్. నేను దానిని దగ్గరగా చూశాను. సంజయ్ దత్ జీవితంలో అన్ని రకాల ఒడిదుడుకులను చూశాడని మనందరికీ తెలుసు, కానీ అతను చాలా డౌన్ టు ఎర్త్.. వినయపూర్వకంగా ఉంటారు. అతను ఈ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడు..ఆయనకు ఏమైనా అవుతుందేమోనని మేమంతా భయపడ్డాము. సంజయ్ దత్ వచ్చి నేను చేస్తాను, నేను చేయాలనుకుంటున్నాను, నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పారని యష్ తెలిపారు. సంజయ్ దత్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని యష్ పొగడ్తలు కురిపించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో ఏప్రిల్ 14, 2022న దేశవ్యాప్తంగా K.G.F: చాప్టర్ 2 విడుదలవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు.