వెబ్‌సిరీస్‌లో సానియా మీర్జా..

Sania Mirza Is All Set to Make Her Digital Debut. సినిమా స్టార్ల‌కు ఏ మాత్రం తీసిపోని అందం సానియా మీర్జా సొంతం.

By Medi Samrat
Published on : 13 Nov 2020 8:21 AM IST

వెబ్‌సిరీస్‌లో సానియా మీర్జా..

సినిమా స్టార్ల‌కు ఏ మాత్రం తీసిపోని అందం సానియా మీర్జా సొంతం. ఆమె కోస‌మే ఎంతో మంది టెన్నిస్ చూస్తార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. చాలా మంది ఆమెను సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగ‌గా.. ఆస‌క్తి లేద‌ని చెబుతూ వ‌స్తోంది. అయితే.. బుల్లితెర‌పై మాత్రం సంద‌డి చేయ‌నుంది.

క్షయ వ్యాధి (టిబి) పట్ల అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ స్టార్ రూపొందిస్తున్న ఎమ్‌టివి నిషేద్ అలోన్ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది. ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్‌ ఎమ్‌టీవీ ఇండియా, ఎమ్‌టీవీ నిషేద్‌ ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా వేదికల్లో విడుదల కానుంది. నవంబర్‌ చివరి వారంలో ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీనిపై సానియా మీర్జా మాట్లాడుతూ.. "టిబి మన దేశంలో అత్యంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. 30 ఏళ్లలోపు నిర్ధారణ అయిన కేసులలో సగం మంది ఉన్నందున, దాని చుట్టూ ఉన్న తప్పులను పరిష్కరించడానికి మరియు అవగాహన మార్పును నడిపించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.


Next Story