సంధ్య థియేటర్ తొక్కిసలాట.. 23 మంది నిందితులు వీరే..!

పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం తెలిపారు.

By -  Medi Samrat
Published on : 27 Dec 2025 7:30 PM IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. 23 మంది నిందితులు వీరే..!

పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం తెలిపారు. సమగ్రమైన, వివరణాత్మక దర్యాప్తు తర్వాత, 24వ తేదీన న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వీరిలో 14 మంది నిందితులను అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన 9 మంది నిందితులకు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపారు.

సంధ్య థియేటర్ నిందితుల జాబితా :

A1: ఆగమతి రామ్ రెడ్డి (పెద్ద రామ్ రెడ్డి) - భాగస్వామి (సంధ్య థియేటర్ యజమాని)

A2: ఆగమతి రామ్ రెడ్డి (చిన్న రామ్ రెడ్డి) - సంధ్య థియేటర్ భాగస్వామి

A3: ఎం.సందీప్ - సంధ్య థియేటర్ భాగస్వామి

A4: ఎం. సుమిత్ (మిట్టు)- సంధ్య థియేటర్ భాగస్వామి

A5: ఆగమతి వినయ్ కుమార్ - సంధ్య థియేటర్ భాగస్వామి

A6: ఆగమతి అశుతోష్ రెడ్డి - సంధ్య థియేటర్ భాగస్వామి

A7: ఎం.రేణుకా దేవి - సంధ్య థియేటర్ భాగస్వామి

A8: ఆగమతి అరుణ రెడ్డి - సంధ్య థియేటర్ భాగస్వామి

A9: ఎం. నాగరాజు - మేనేజర్, సంధ్య థియేటర్

A10: గంధకం విజయ్ చందర్ - లోయర్ బాల్కనీ ఇన్‌ఛార్జ్ మరియు గేట్ కీపర్

A11: అల్లు అర్జున్ (బన్నీ) - సినీ నటుడు

A12: జోస్య భట్ల సంతోష్ కుమార్ - అల్లు అర్జున్ మేనేజర్

A13: శరత్ బన్నీ (శరత్ చంద్ర నాయుడు) - అల్లు అర్జున్ మేనేజర్

A14: తాటిపాముల వినయ్ కుమార్ (అర్జున్ కుమార్) - ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్

A15: ఎండీ. పర్వేజ్ - A16 నిందితుడి అసిస్టెంట్

A16: తాళ్ల కిరణ్ కుమార్ గౌడ్ (రాజు) - ఈవెంట్ ఆర్గనైజర్ / ఎలక్ట్రీషియన్

A17: చెరుకు రమేష్ - అల్లు అర్జున్‌ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్

A18: శ్రీరాముల రాజు - అల్లు అర్జున్‌కి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్

A19: ఇబ్రహీం మొహమ్మద్ ఫిర్దోష్ - బౌన్సర్

A20: ఆజం పాషా (బాబీ) - బౌన్సర్

A21: డి. మహేష్ - బౌన్సర్

A22: రాజ్ ఆంటోనీ డిమెల్లో (ఆంటోనీ) - బౌన్సర్

A23: పెగ్గాపురం సత్యమూర్తి - బౌన్సర్

Next Story