స్పిరిట్ సినిమా గురించి కీలక విషయాలను బయట పెట్టిన సందీప్ వంగా

స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కలిసి పని చేయబోతున్నారు. ఈసారి సందీప్ ఎలాంటి ఇంటెన్స్ డ్రామా, యాక్షన్ సినిమా ప్లాన్ చేశారోనని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Medi Samrat  Published on  8 April 2024 9:45 PM IST
స్పిరిట్ సినిమా గురించి కీలక విషయాలను బయట పెట్టిన సందీప్ వంగా

స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కలిసి పని చేయబోతున్నారు. ఈసారి సందీప్ ఎలాంటి ఇంటెన్స్ డ్రామా, యాక్షన్ సినిమా ప్లాన్ చేశారోనని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బస్టర్ కబీర్ సింగ్, యానిమల్‌తో భారతదేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న వంగతో ప్రభాస్ సినిమా చేస్తూ ఉండడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగా.. షూటింగ్, దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

యానిమల్ కంటే ముందే ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ చేయాలనే ఆలోచనతో ప్రభాస్ తనని సంప్రదించినట్లు వంగా చెప్పారు. స్పిరిట్ స్క్రిప్ట్ పనులు 60% పూర్తి చేసాను.. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు సందీప్ వంగా వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ గురించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తన గత సినిమాలలో లాగా హీరో ధనిక కుటుంబానికి చెందినవాడు కాదని.. స్పిరిట్‌లో ప్రభాస్ సాధారణ కుటుంబానికి చెందినవాడన్నారు.

Next Story