బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న‌ సమంత 'యశోద' సినిమా

Samanthas Yashoda Movie Break Even Completed. సమంత నటించిన లేటెస్ట్‌ చిత్రం 'యశోద' మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

By M.S.R  Published on  20 Nov 2022 9:30 PM IST
బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న‌ సమంత యశోద సినిమా

సమంత నటించిన లేటెస్ట్‌ చిత్రం 'యశోద' మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించింది. హరి-హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అంతేకాకుండా మంచి కలెక్షన్‌లతో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుంది. యశోద సినిమాకు రూ.11.50 కోట్ల బిజినెస్ సాగింది. రూ.12 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం రూ.12.03 కోట్లు సాధించి బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే యూఎస్‌లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది.

సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేశారు. ఈ చిత్రంలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సామ్ మెప్పించింది. పర్సనల్ లైఫ్ లో మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమంత చూపించిన డెడికేషన్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.


Next Story