సమంత సినిమా బిజినెస్ బాగానే ఉంది.. కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో..?

Samantha Yashoda Movie Business. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా

By Medi Samrat  Published on  10 Nov 2022 3:49 PM IST
సమంత సినిమా బిజినెస్ బాగానే ఉంది.. కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో..?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. ఏసియన్ సినిమాస్ ఈ థియట్రికల్ రైట్స్‌ని కొనుగోలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకి రూ.12 కోట్లు ఏసియన్ సినిమాస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌తో కలిపి ఓవరాల్‌గా రూ.22 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన సమంత రంగస్థలం తరువాత ఆమె ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. గుణశేఖర్ పాన్ ఇండియా సినిమాగా 'శాకుంతలం' సినిమా చేస్తుండగా. ఇక రేపు 'యశోద' సినిమా థియేటర్లకు వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఐదు భాషల్లో విడుదలవుతోంది. సమంత ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది.


Next Story