సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ సంచలన పోస్టు.. సమంత విడాకుల ప్రకటనకు ముందే భావోద్వేగ పోస్టు

Samantha Stylist Preetham Jukalker. సమంత-నాగ చైతన్య విడాకుల గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on  3 Oct 2021 10:05 AM GMT
సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ సంచలన పోస్టు.. సమంత విడాకుల ప్రకటనకు ముందే భావోద్వేగ పోస్టు

సమంత-నాగ చైతన్య విడాకుల గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ కొన్ని సంచలన పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శనివారం ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన ప్రీతమ్ ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. 'Families who hide true natuire of their men are responsible for the violence againist women that follows…' అంటూ పోస్ట్ పెట్టాడు. వాళ్ల ఇళ్లలో ఉన్న మగవాళ్ల స్వభావాన్ని ఏ కుటుంబమైతే దాచి పెడుతుందో.. వాళ్లే మహిళలపై హింసకు కారణం అన్నట్లు పోస్టులో తెలిపాడు. "సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లే ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది" అని మరో స్టోరీ పెట్టాడు.


ఇక అంతకు ముందు సమంత కూడా ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టడం జరిగింది. విడాకుల ప్రకటనకు ముందే సమంత ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఈ పోస్టులో ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళ ఫొటోను షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యింది. 'నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం' అంటూ స్టోరీని పోస్టు చేసింది సమంత. ఇలా సమంత, సమంత సన్నిహితుల పోస్టులు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా విడాకుల కారణాలను ఊహించుకుంటూ ఉన్నారు.

Next Story