'పుష్ప' నుండి సమంత ఐటం సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..

Samantha Speacial Song Release From Pushpa Movie. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' చిత్రంలో సమంత ఓ ఐటం

By Medi Samrat  Published on  10 Dec 2021 7:03 PM IST
పుష్ప నుండి సమంత ఐటం సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' చిత్రంలో సమంత ఓ ఐటం పాట చేస్తోందంటేనే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 'పుష్ప' చిత్రం నుంచి వచ్చిన పాటలు ఇప్పటికే పాపులర్ కాగా.. సమంత చేయబోయే పాట మీద భారీ హైప్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అభిమానులకు 'పుష్ప' చిత్రయూనిట్ కోరిన గిఫ్ట్ ఇచ్చేసింది. నేడు పాటను విడుదల చేశారు. సుక్కు – దేవిశ్రీ కాంబోలో వచ్చే ఐటమ్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుందనేది వారి ఫాన్స్ నమ్మకం. దానికి ఏమాత్రం తీసిపోలేదు ఈ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ ను ఇంద్రావతి చౌహాన్ అనే గాయనితో పాడించారు. అలానే తమిళంలో ఆండ్రియా ఈ పాటను పాడింది. స్టార్ హీరోయిన్ సమంత తో స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్‌ ఆచార్య అదిరిపోయే మూమెంట్స్ ఇప్పించారు.


చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల రిలీజైన 'పుష్ప' ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం డిసెంబరు 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదుల కానుంది. ఇక డిసెంబర్ 12 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది


Next Story