విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషి' వచ్చేస్తోంది..!

Samantha shares Kushi poster, calls her new film with Vijay Deverakonda ‘an explosion of joy. సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండల లేటెస్ట్ సినిమాకు 'ఖుషి' అనే టైటిల్ పెట్టారు.

By Medi Samrat  Published on  16 May 2022 7:39 AM GMT
విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి వచ్చేస్తోంది..!

సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండల లేటెస్ట్ సినిమాకు 'ఖుషి' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. కశ్మీరీ వేషధారణలో విజయ్ దేవరకొండ కనిపిస్తుండగా.. సమంత పింక్ చీరలో అతనితో పాటు ఉంది. ఆన్‌స్క్రీన్ లో ఇద్దరి జోడీ బాగుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు నటిస్తూ ఉన్నారు.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ విభాగాన్ని చూసుకుంటూ ఉన్నాడు. గుణశేఖర్ పౌరాణిక నాటకం శాకుంతలం లో సమంతా యువరాణి శకుంతల పాత్రను పోషిస్తోంది. యశోద, బాలీవుడ్ ఫిల్మ్ సిటడెల్, హాలీవుడ్ ఫిల్మ్ 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' లో కూడా సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తోనే లైగర్, జన గణ మన సినిమాలలో నటిస్తూ ఉన్నాడు.

అంతకుముందు.. విజయ్ దేవరకొండ, ఖుషి బృందం సమంతా పుట్టినరోజున అర్ధరాత్రి నాడు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ చేస్తున్నట్లు సమంతను నమ్మిస్తూ.. బర్త్ డేను నిర్వహించారు.


Next Story
Share it