సమంత ఇంట తీవ్ర విషాదం

సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.

By Medi Samrat  Published on  29 Nov 2024 5:54 PM IST
సమంత ఇంట తీవ్ర విషాదం

సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "నాన్నా... మనం మళ్లీ కలిసేంత వరకూ.." అని ఆమె పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేశారు. దీన్ని చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తనపై తన తండ్రి ప్రభావం ఎంతో ఉందని గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో సమంత తెలిపారు.

Next Story