సమంత ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇచ్చేది ఎవరో..?

Samantha Ruth Prabhu suffers health complications. ప్రముఖ దక్షిణ భారత నటి సమంత రూత్ ప్రభు ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది

By Medi Samrat  Published on  19 Sept 2022 6:14 PM IST
సమంత ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇచ్చేది ఎవరో..?

ప్రముఖ దక్షిణ భారత నటి సమంత రూత్ ప్రభు ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. సమంత పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. యశోద సినిమాను త్వరలోనే విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు.

సమంతా ఇతర ప్రాజెక్ట్ లలో 'శాకుంతలం' గురించి భారీ అంచనాలు ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవ్ మోహన్ ఈ చిత్రంలో దుష్యంతుడి పాత్రలో నటిస్తూ ఉన్నాడు. సమంత తన చర్మ సమస్యకు చికిత్స కోసం అమెరికాకు వెళ్ళింది. సామ్ ఈ చర్మ సమస్య కారణంగా చాలా బాధపడుతోందని.. డిప్రెషన్‌లోకి జారుకుందని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.

గత కొన్ని వారాలుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది. సమంత బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించుకుంది. సమంతా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోందని.. అందుకే ఆమె బయట కనిపించడం లేదని చెబుతున్నారు. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, సమంతా బహిరంగంగా కనిపించడం పూర్తిగా మానుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారని చెప్పారని కథనాన్ని ప్రచురించింది. ఆమె 'ఖుషి' సినిమా తదుపరి షెడ్యూల్‌ను కూడా వాయిదా వేసిందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఆమె ఆరోగ్యం బాగోలేదన్న ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story