ట్రైనింగ్ తీసుకున్నా.. గాయపడిన సమంత
Samantha Ruth Prabhu Posts Pic Of Bruised Hands. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
By Medi Samrat Published on 28 Feb 2023 7:33 PM ISTప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలైన చేతులను సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. దీంతో అభిమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయిన సమంత మళ్లీ షూటింగ్ లకు హాజరు అవుతోంది. ప్రస్తుతం `సిటాడెల్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా తెరకెక్కుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సిటాడెల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో సమంత పోలీసుగా అలరించబోతోంది.
సినీ ఇండస్ట్రీలో తన 13 ఏళ్ల జర్నీని రెండు రోజుల కిందటే పూర్తి చేసుకున్న సమంత.. షూటింగ్ లో తను గాయపడింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో దెబ్బలు తగిలించుకుంది. రెండు చేతులకు గాయాలైన విషయాన్ని సమంత తెలిపింది. ఈ మేరకు సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. రెండు చేతుల ఫొటో పెట్టి ‘యాక్షన్ ఫలితం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా గాయాలు మాత్రం తప్పలేదని సమంత తెలిపింది.