సూపర్ నిర్ణయం తీసుకున్న సమంత..!
స్టార్ హీరోయిన్ సమంత సూపర్ నిర్ణయం తీసుకుంది. సమంత కొత్తగా నిర్మాత అవతారం ఎత్తింది.
By Medi Samrat Published on 11 Dec 2023 6:23 PM ISTస్టార్ హీరోయిన్ సమంత సూపర్ నిర్ణయం తీసుకుంది. సమంత కొత్తగా నిర్మాత అవతారం ఎత్తింది. నటి సమంతా రూత్ ప్రభు హైదరాబాద్‌కు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మండోవా మీడియా వర్క్స్‌తో కలిసి 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'ను స్థాపించడం ద్వారా నిర్మాణ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ వార్త ఆమె అభిమానులకు మాత్రమే కాదు ఎంతో మంది ట్యాలెంటెడ్ దర్శకులకు, నటీనటులకు తీపి కబురులా మారింది. సమంతా ట్రలాలా విషయంలో తనకంటూ ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. మంచి కథలను అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపింది.
ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఫార్మాట్‌లను కవర్ చేస్తూ ఫిల్మ్, వెబ్, టీవీ వంటి విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో ఉత్తేజకరమైన కంటెంట్‌ను రూపొందించడం కోసం తమ నిర్మాణ సంస్థ ద్వారా సహకారం అందిస్తామని వివరించింది సమంత. ప్రొడక్షన్‌లోకి సమంత ఎంట్రీతో భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించిన OTT షో ‘సిటాడెల్’ విడుదలకు సిద్ధమవుతోంది సమంత. ఈ సిరీస్ 2024 వేసవిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.