సమంతకు మళ్లీ ఏమైంది..?

Samantha – I am down with fever and lost my voice. సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

By Medi Samrat  Published on  12 April 2023 6:57 PM IST
సమంతకు మళ్లీ ఏమైంది..?

Samantha


సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో సమంత పెద్దగా పాల్గొనడం లేదు. సమంతకు ఏమైందా అనే డౌట్స్ అభిమానుల్లో ఉన్నాయి. ఈ తరుణంలో సమంత జ్వరంతో బాధపడుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా వరుస సినిమా ప్రొమోషన్స్‌, బిజీ షెడ్యూల్‌ కారణంగా కాస్త జ్వరంగా ఉందని, మాట్లాడలేకపోతున్నా అని తెలిపింది. తన ఆరోగ్యం దృష్ట్యా ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపింది.

‘ఈ వారమంతా నా సినిమాని ప్రమోట్‌ చేస్తూ.. మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. అయితే, దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్స్‌, ప్రమోషన్స్‌ కారణంగా ప్రస్తుతం నేను జ్వరంతో బాధపడుతున్నాను. మాట్లాడలేకపోతున్నాను. దయచేసి ఈ సాయంత్రం MLRIT కళాశాల వార్షిక దినోత్సవ కార్యక్రమంలో ‘శాకుంతలం’ బృందంతో చేరండి. మిమ్మల్ని మిస్‌ అవుతున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది సమంత. శాకుంతలం సినిమా ఏప్రిల్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.


Next Story