ఆ ఇంటినే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న సమంత
Samantha buys house where she used to live with Naga Chaitanya. సమంత, నాగచైతన్య 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 29 July 2022 7:55 PM ISTసమంత, నాగచైతన్య 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, విడిపోయే సమయంలో సమంత ఓ ఖరీదైన ఇంటిని భరణంగా తీసుకుందని ప్రచారం జరిగింది. దీనిపై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ వివరణ ఇచ్చారు. గతంలో ఆ ఇంటిలో సమంత, నాగచైతన్య కలిసి ఉండేవారని, అయితే ఆ ఇంటిని అమ్మేసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారని వెల్లడించారు. కొత్త ఇంటి పనులు ఇంకా జరుగుతుండడంతో, కొన్నాళ్ల పాటు ఈ పాత ఇంట్లోనే ఉన్నారని.. సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయిందని అన్నారు. కొంతకాలం తర్వాత సమంత తన వద్దకు వచ్చి ఆ ఇంటిని మళ్లీ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన చేసిందని మురళీమోహన్ వెల్లడించారు.
మరొక చోట ఉండేందుకు సమంత ఇష్టపడలేదని, పాత ఇల్లే సురక్షితంగా ఉంటుందని ఆమె భావించిందని తెలిపారు. అందుకే ఎక్కువ ధర చెల్లించి తమ పాత ఇంటిని కొనుగోలు చేసిందని మురళీమోహన్ వివరించారు. ఆ ఇల్లు తన సోదరుడు, కొడుకుతో కలిసి నివసించేందుకు మల్టీఫ్లోర్ హౌస్ గా కట్టుకున్నామని అన్నారు. సమంత, నాగచైతన్యల పెళ్లయ్యాక వారి కొత్త కాపురం ఆ ఇంట్లోనే మొదలైందని మురళీమోహన్ వెల్లడించారు. వారిద్దరూ విడిపోతారని తాను అసలు ఊహించలేదని, పర్ఫెక్ట్ జంట అంటే వాళ్లే అనుకున్నానని అన్నారు. వాళ్లసలు గొడవపడడం ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. బయటి వ్యక్తులను ఇంటికి తీసుకురావడం, పెద్ద శబ్దంతో సంగీతం, పార్టీలు చేసుకోవడం వంటి సమస్యలు లేనేలేవని అన్నారు. సమంత, ఆమె తల్లి ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని సీనియర్ నటుడు తెలిపారు.