రికార్డుల.. సలార్..!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్' ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

By Medi Samrat  Published on  25 Dec 2023 9:56 PM IST
రికార్డుల.. సలార్..!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్' ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చాలా గ్యాప్ తరువాత అభిమానులు కోరుకున్నట్టుగా ప్రభాస్ కనిపించడంతో భారీ కలెక్షన్స్ ను ఈ సినిమా సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో రూ.402 కోట్లను వసూలు చేసింది. ఈ రోజున క్రిస్మస్ సెలవు దినం కావడం వలన వసూళ్ల జోరు తగ్గదు. వచ్చే వారం కూడా లాంగ్ వీకెండ్ ఉండడంతో సినిమా ఇంకో వారంలో 1000 కోట్ల కలెక్షన్స్ ను ఎంతో సులువుగా దాటేయనుంది.

ఇక షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డుంకీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. హిందీలో, డుంకీ ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సలార్ హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. అయితే డుంకీ బడ్జెట్ చాలా తక్కువ కావడం.. కేవలం హిందీలో మాత్రమే విడుదల అవ్వడం.. యావరేజ్ టాక్ రావడం కలెక్షన్స్ కు కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు.

Next Story