సలార్ కొత్త రిలీజ్ డేట్ చెప్పేది అప్పుడేనా?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా వాయిదా వేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది.

By Medi Samrat  Published on  5 Sep 2023 2:31 PM GMT
సలార్ కొత్త రిలీజ్ డేట్ చెప్పేది అప్పుడేనా?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా వాయిదా వేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజి హిట్ ప్రభాస్ కు సలార్ ద్వారా వస్తుందని అందరూ ఆశిస్తూ వచ్చారు. అంతేకాకుండా సెప్టెంబర్ 28 నుండి వరుసగా హాలిడేస్ ఉండడంతో భారీ కలెక్షన్స్ ను సాధిస్తుందని ఊహించారు. కానీ వాయిదా పడుతున్నట్లు వార్తలు రావడంతో రెబల్ స్టార్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. సినిమా ఈ ఏడాది వస్తే నవంబర్ మొదటి వారం, లేదా ఆఖరి వారం.. ఇక అది కాదంటే క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది కాదంటే సంక్రాంతికి వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. వివిధ అంశాలు, అన్ని భాషలలో ఇతర సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త విడుదల తేదీని లాక్ చేస్తున్నామని మేకర్స్ అంటున్నారు.

సెప్టెంబరు 7న లేదా అంతకంటే ముందే కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సలార్ అధికారికంగా విడుదల తేదీ కోసం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. సలార్ వాయిదా వేయడంతో ఇతర సినిమాలను హాలిడేస్ సమయంలో విడుదల చేసుకోవడం కోసం భారీ అవకాశం వచ్చింది. రామ్ స్కంద, మూడు తెలుగు సినిమాలు, నాలుగు తమిళ చిత్రాలు తమ సినిమాలను సలార్ విడుదల తేదీకి షిఫ్ట్ చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి.

Next Story