బిగ్ బాస్ 5: సింగర్ శ్రీరామ్‌కు సజ్జనార్‌ విషెస్‌.. టైటిల్‌ గెలవాలంటూ..

Sajjanar wishes Sriram Chandra to win the Bigg Boss 5 title. హీరో నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తోంది బిగ్‌ బాస్‌ రియాలిటీ షో. ప్రస్తుతం 10 వారానికి చేరుకుంది.

By అంజి  Published on  14 Nov 2021 5:34 AM GMT
బిగ్ బాస్ 5: సింగర్ శ్రీరామ్‌కు సజ్జనార్‌ విషెస్‌.. టైటిల్‌ గెలవాలంటూ..

హీరో నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తోంది బిగ్‌ బాస్‌ రియాలిటీ షో. ప్రస్తుతం 10 వారానికి చేరుకుంది. అంతకుముందు లోబో, గత వారం విశ్వ బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యి ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు. జశ్వంత్‌ పడాల అనారోగ్యం కారణంగా హౌస్‌ నుండి బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉన్నారు. వీరిలో సింగర్‌ శ్రీరామచంద్రకు పలువురు సెలబ్రిటీల నుండి మంచి సపోర్ట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇటీవల తన సపోర్ట్‌ శ్రీరామచంద్రకు ఉంటుందని తెలిపింది.

ఫైనల్‌లో టైటిల్‌ కోసం శ్రీరామ్‌ ఓటు వేయాలని తన అభిమానులను కోరింది. ప్రముఖ హిందీ కమెడియన్‌ భారతీ సింగ్‌ కూడా తన ఫ్రెండ్‌ శ్రీరామచంద్రకు ఓటు వేయాలని సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. నటుడు సోనూసూద్‌ కూడా తెలుగు బిగ్‌బాస్‌ గురించి స్పందిస్తూ.. సింగర్‌ శ్రీరామ్‌కు తన మద్ధతు తెలిపాడు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా శ్రీరామ చంద్రకు మద్ధతు తెలిపాడు. ప్రత్యేక వీడియో ద్వారా గేమ్‌ చాలా బాగా ఆడుతున్నట్లు తెలిపాడు. శ్రీరామ్‌ కప్‌ గెలుస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.


Next Story
Share it