బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో సైఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16, గురువారం తెల్లవారుజామున తన ఇంటిలో గుర్తుతెలియని దొంగ దాడి చేయడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీ ఖాన్‌ను తన ఇంటిలో కత్తితో పొడిచాడు. దుండగుడు సైఫ్‌ను మూడు సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు దొంగను గుర్తించేందుకు ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.