సాయి పల్లవి పెళ్లి.. నిజమేనా..!

Sai Pallavi Marriage Rumours Goes Viral. సాయి పల్లవి.. సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తాజాగా నానితో కలిసి నటించిన

By Medi Samrat  Published on  2 May 2022 1:49 PM IST
సాయి పల్లవి పెళ్లి.. నిజమేనా..!

సాయి పల్లవి.. సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తాజాగా నానితో కలిసి నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో అద్భుతమైన పాత్రలో కనిపించింది. రానా దగ్గుబాటితో కలిసి ఆమె నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి గురించి ఓ వార్త సినీ పరిశ్రమలో వైరల్ అవుతోంది. ఆమె పెళ్లి చేసుకోబోతోందని పెళ్లి ఏర్పాట్లలో ఆమె కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా ఆమె కొత్తగా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. పెళ్లి కోసమే ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయలేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, ఆమె సన్నిహితులు మాత్రం స్పందించారు. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందనే వార్తల్లో నిజం లేదని వారు చెప్పారు. మంచి క్యారెక్టర్ల కోసం ఆమె ఎదురు చూస్తోందని, మంచి పాత్రలు దొరికితే ఆమె కొత్త సినిమాలో నటిస్తుందని తెలిపారు. గతంలో కూడా సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు రాగా వాటిని సాయి పల్లవి ఖండించింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు వచ్చాయి. దీనిపై సాయి పల్లవి ఏమని అంటుందో..!










Next Story