సినిమా హాళ్లలో అడుగుపెట్టాను.. మీరు కూడా రండి ఆనందించండి అంటున్న మెగా హీరో

Sai Dharam Tej walks into Prasads Multiplex on Day 1 of reopening. కరోనా ప్రబలుతున్న సమయంలో సినిమా థియేటర్లను మూసి

By Medi Samrat  Published on  4 Dec 2020 5:04 PM IST
సినిమా హాళ్లలో అడుగుపెట్టాను.. మీరు కూడా రండి ఆనందించండి అంటున్న మెగా హీరో

కరోనా ప్రబలుతున్న సమయంలో సినిమా థియేటర్లను మూసి వేశారు. దీంతో సినీ ప్రియులకు ఎంటర్టైన్మెంట్ లో లోటు మొదలైంది. ఓటీటీలలో సినిమాలను, షో లను చూసుకుంటూ గడిపేశారు. ఇక కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్లకు కూడా వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగానే పలు నగరాల్లో సినిమా థియేటర్లను ఇప్పటికే తెరిచారు. తాజాగా హైదరాబాద్ లో కూడా సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి.

8 నెలలు తర్వాత థియేటర్‌లు తెరుచుకోవడంతో హీరో సాయిధరమ్‌ తేజ్ ఆనందం వ్యక్తం చేసి..‌ సినిమా చూసేందుకు వెళ్ళాడు. ప్రసాద్‌ మల్టీప్టెక్స్‌ ఐమ్యాక్స్‌లో ఇవాళ విడుదలైన 'టెనెట్'‌ సినిమా చూసేందుకు వెళుతున్న వీడియోను ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెండితెరపై సినిమా చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తిరిగి థియేటర్లకు రావాలని కోరాడు. 'చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉంది. బిగ్‌స్రీన్‌పై సినిమాను చూడటమంటేనే అద్భుతమైన వినోదం. చాలామంది కూడా ఇలానే భావిస్తారు. సినిమాను మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుందాం' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే థియేటర్‌కు వచ్చే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని తేజ్‌ సూచించాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా డిసెంబర్ నెలలో విడుదల కాబోతోంది.




Next Story