'బ్రో' మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌

Sai Dharam Tej Bro Movie Second Single Out Now. బ్రో చిత్రంలో నుండి మరో పాట విడుదలైంది. 'జాణవులే నెరజాణవులే' అంటే సాగే ఈ రొమాంటిక్ గీతాన్ని సాయిధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించారు.

By Medi Samrat  Published on  15 July 2023 5:20 PM IST
బ్రో మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌

BRO: The Avatar పేరుతో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా రాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు.


బ్రో చిత్రంలో నుండి మరో పాట విడుదలైంది. 'జాణవులే నెరజాణవులే' అంటే సాగే ఈ రొమాంటిక్ గీతాన్ని సాయిధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించారు. తమన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను తమన్, ప్రణతి ఆలపించారు. 'బ్రో' నుంచి కొద్దిరోజుల కిందట విడుదలైన మైడియర్ మార్కండేయ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్, సాయిధరమ్ తేజ్ లపై చిత్రీకరించిన ఆ పాట లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు. ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న 'బ్రో' చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Next Story