అప్పుడు సాయి ధరమ్ తేజ్ కు ఫిట్స్ వచ్చాయి

Sai Dharam Tej Accident. రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను తొలుత మెడికవర్ ఆసుపత్రికి

By Medi Samrat
Published on : 11 Sept 2021 4:38 PM IST

అప్పుడు సాయి ధరమ్ తేజ్ కు ఫిట్స్ వచ్చాయి

రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను తొలుత మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయనను అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. సాయితేజ్ కు సంబంధించి మెడికవర్ వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. సరైన సమయంలో సాయితేజ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారని అందువల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. సరైన సమయంలో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)లో 108 సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారని అన్నారు.

బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే తేజ్ కు ఫిట్స్ వచ్చాయని.. 108 సిబ్బంది తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారని మెడికవర్ వైద్యులు చెప్పారు. తేజ్ కు రెండో సారి ఫిట్స్ రాకుండా తాము చికిత్స చేశామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, షోల్డర్, స్పైనల్ కార్డ్, అబ్ డామిన్, చెస్ట్ స్కానింగ్ లు చేశామని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్ద గాయాలు కాలేదని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వల్ల... ఆయనకు కృత్రిమ శ్వాస పెట్టామని చెప్పారు.

హెల్మెట్ పెట్టుకోవడంతో లక్కీగా అతని తలకు గాయాలు కాలేదన్నారు.. కాకపోతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడని.. దీంతో కృత్రిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు.


Next Story