5 లక్షలు పలికిన OG టికెట్ ధర.. ఎవరికి ఇచ్చారంటే.?

పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమాకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

By Medi Samrat
Published on : 5 Sept 2025 9:15 PM IST

5 లక్షలు పలికిన OG టికెట్ ధర.. ఎవరికి ఇచ్చారంటే.?

పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమాకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా మొదటి టికెట్ రూ.5 లక్షలకు వేలం వేయబడింది. OG మొదటి టికెట్ వేలం డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. "టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం వేలంలో మొదటి టికెట్‌ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. పవన్ అభిమానులు సందీప్ ధనపాల, అరవింద్ రూ. 5 లక్షల మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు.

అభిమానులు పవన్ సోదరుడు, JSP సభ్యుడు నాగబాబును కలిసి చెక్కును అందజేశారు. పవన్ కళ్యాణ్, పార్టీ పట్ల అభిమానులకు ఉన్న ప్రేమను నాగబాబు ప్రశంసించారు.

Next Story