ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..!

RRR Trailer Release Date Update. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By Medi Samrat  Published on  4 Dec 2021 5:58 PM IST
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రను పోషించారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలు, పాటలు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ముందు ప్ర‌క‌టించారు.

కాని సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో ట్రైల‌ర్‌ని వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 9న ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు కాగా, అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ భార్యగా శ్రియ నటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో భారీగా రిలీజ్ చేయడానికి అన్ని ప్రణాళికలను ఆర్ఆర్ఆర్ టీమ్ రచించింది. ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు.


Next Story