ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి
RRR Release Date. ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం గత కొద్దిరోజులుగా
By Medi Samrat Published on 2 Oct 2021 8:45 PM ISTఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం గత కొద్దిరోజులుగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎట్టకేలకు చిత్ర దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రాజమౌళి సోషల్ మీడియాలో 07.01.2022.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఇదేనంటూ వెల్లడించారు. ఒక పోస్టర్ ను కూడా రాజమౌళి పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ చిత్రం. కీరవాణి సంగీతం అందించారు.
07.01.2022. It is… :) #RRRMovie #RRROnJan7th @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/eQDxGEajdy
— rajamouli ss (@ssrajamouli) October 2, 2021
తొలుత ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 7న సంక్రాంతి కానుకగా ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి ఇప్పటికే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, ఎఫ్3 వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో భారీ తారాగణం ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించనున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.