చరణ్ బర్త్‌డే గిప్ట్.. రామరాజు న్యూ అవతార్ మరికాసేపట్లో
RRR Movie New Update. తెలుగు చిత్రపరిశ్రమలోనే ఇప్పటివరకూ లేనంత హై బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్
By Medi Samrat Published on 26 March 2021 2:34 PM ISTతెలుగు చిత్రపరిశ్రమలోనే ఇప్పటివరకూ లేనంత హై బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరోల ఫస్ట్‌లుక్ లకు మంచి స్పందన వచ్చింది.
Celebrations to start a little early. 🤗
— RRR Movie (@RRRMovie) March 26, 2021
Get ready to meet @AlwaysRamCharan, in his 🔥 new avatar, at 4 PM today.
Fiercest #AlluriSitaRamaRaju is on his way to leave you spellbound. 🔥👊🏻#RRR #RRRMovie @ssrajamouli @tarak9999 @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/8JG0d7X0Aj
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. రేపు చరణ్ 36వ వసంతంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రామరాజు కొత్త అవతారాన్ని చూడబోతున్నారంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నయా అవతార్‌లో ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే.. ఆర్ఆర్ఆర్ లో అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియ, అలియభాట్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది ఆర్ఆర్ఆర్.
ఇదిలావుంటే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తనను విష్ చేయడానికి వచ్చిన అభిమానులతో కలిసి రామ్ చరణ్ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.