రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకుంటూ వెళుతోంది. రెండో వారంలో కూడా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు వెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్ల మార్కును దాటేసింది ఈ సినిమా. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన RRR విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా అనేకసార్లు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. RRR చివరకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. చిత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు ఊహించని రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాయి. RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల మార్కును దాటేసింది. "#RRRMovie has crossed 800 Crs Gross at the WW Box Office.." అంటూ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ట్వీట్ చేశారు.
800 కోట్ల మార్కును దాటేసిన ఆర్ఆర్ఆర్స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ RRR. రామ్ చరణ్ సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. RRRలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, శ్రియా శరణ్, సముద్రఖని కూడా సహాయక పాత్రల్లో కనిపించారు.